Skip to main content

Posts

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కరోనావైరస్ పాజిటివ్

  హైదరాబాద్: బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర సమన్వయ కర్త, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కరోనావైరస్ బారినపడ్డారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన గాంధీ ఆస్పత్రిలో చేరారు. పరీక్షించిన గాంధీ ఆస్పత్రి వైద్యులు ఆరోగ్యగం నిలకడగానే ఉందని తెలిపారు. కరోనా స్వల్ప లక్షణాలే ఉండటంతో వైద్యుల సలహాలు తీసుకుని ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆగస్టు 8న నల్గొండలో నిర్వహించిన రాజ్యాధికార సంకల్ప సభలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

విశాఖ మునిగిపోతుందట-ముంబై, చెన్నై, కొచ్చీ కూడా

  ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వాతావరణ మార్పుల ప్రభావం వివిధ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న నగరాలపై వీటి ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్ధ నాసాకు చెందిన అంతర్ ప్రభుత్వాల ప్యానెల్ ఇచ్చిన తాజా రిపోర్ట్. ఇందులో భారత్ లోని 12 తీర ప్రాంత నగరాలు వాతావరణ మార్పుల కారణంగా ఈ శతాబ్ధం అంతమయ్యే లోపు 3 అడుగుల మేర సముద్రంలో మునిగిపోతాయని తేలింది.

థర్డ్‌వేవ్ సంకేతం: ఆ రాష్ట్రంలో 21 వేలకు పైగా కరోనా కొత్త కేసులు

  తిరువనంతపురం: ప్రాణాంతక కరోనా వైరస్ థర్డ్ వేవ్ తీవ్రత ఆరంభమైన పరిస్థితులు కనిపిస్తోన్నాయి. సెకెండ్ వేవ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్న సమయంలో- వేల సంఖ్యలో నమోదైన కొత్త కేసులు పునరావృతం కానున్నాయనే సంకేతాలు అందుతోన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ- ఒకట్రెండు రాష్ట్రాల్లో ఆ మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉందనడానికి సాక్ష్యంగా నిలిచింది.. కేరళ. సెకెండ్ వేవ్ తీవ్రత ఏపీ సహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో నియంత్రణలోనే ఉన్నా.

సుప్రీం అసాధారణ చర్య-9 రాజకీయ పార్టీలకు జరిమానా

  దేశంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు తమ అభ్యర్ధులపై నమోదైన కేసుల్ని వెల్లడించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలు పాటించకపోవడంతో సుప్రీంకోర్టు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా కేసులు వెల్లడించని 9 రాజకీయ పార్టీలపై కొరడా ఝళిపించింది. వీరికి స్ధాయిని బట్టి జరిమానా విధించడంతో పాటు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న పలు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్దుల నేర చరిత్రను ఆయా రాజకీయ పార్టీలు ప్రజలకు బహిర్గతం చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది

జగన్ సర్కారుకు అప్పు ఇచ్చింది వీళ్లే

  అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్' అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యతిరేకులు చాలా రోజులుగా చేస్తోన్న విమర్శలకు మరింత బలం చూకూరేలా ఆ విషయాన్ని కేంద్రంలోని మోదీ సర్కారు పదే పదే నిర్ధారిస్తూ వస్తున్నది. ఏపీకి తలకు మించిన భారంగా మారిన అప్పుల వ్యవహారంపై అటు బీజేపీ, ఇటు టీడీపీ నేతలు అడుగుతోన్న ప్రశ్నలకు కేంద్రం వివరణాత్మక సమాధానాలిస్తున్నది. అప్పులు చేయడంలో ఆంధ్రా అగ్రభాగాన ఉందని ఇదివరకే తేల్చి చెప్పిన కేంద్రం.. తాజాగా అసలు జగన్ సర్కారుకు రుణాలు..

IDBI బ్యాంకులో ఉద్యోగాల జాతర

  బ్యాంకులో ఉద్యోగం చేయాలని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 920 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేసేందుకు ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి ఆ తర్వాత ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది.ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 920 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది

రిజైన్ చేస్తా: డెవలప్ చేయండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్

కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అభివృద్ది చేస్తే.. తన పదవీకి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అంతేకాదు మళ్లీ పోటీ కూడా చేయనని స్పష్టంచేశారు. తన నియోజకవర్గం అభివృద్ధి ముఖ్యం అని చెప్పారు. సంక్షేమం ఇంపార్టెంట్ అని.. తర్వాతే పదవులు అని ఇండికేషన్స్ ఇచ్చారు. ఇవాళ చౌటుప్పల్ మండలంలో కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఆ మీటింగ్‌లో వెంకట్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు.