హైదరాబాద్: బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర సమన్వయ కర్త, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కరోనావైరస్ బారినపడ్డారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన గాంధీ ఆస్పత్రిలో చేరారు. పరీక్షించిన గాంధీ ఆస్పత్రి వైద్యులు ఆరోగ్యగం నిలకడగానే ఉందని తెలిపారు.
కరోనా స్వల్ప లక్షణాలే ఉండటంతో వైద్యుల సలహాలు తీసుకుని ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆగస్టు 8న నల్గొండలో నిర్వహించిన రాజ్యాధికార సంకల్ప సభలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.