యావత్ భారతదేశం నీరజ్ కు నీరాజనం పలుకుతోంది. కేవలం కొద్ది నిమిషాల్లో ఈ యువ అథ్లెట్ పేరు ఇంటర్నెట్ ను షేక్ చేసేసింది. ట్విట్టర్లో ట్వీట్ల మోత మోగుతోంది. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా ఇలా ఏ సోషల్ మీడియ చూసినా తన పేరు మారు మోగుతోంది. ఇంతకీ ఈ నీరజ్ చోప్రా ఎవరు? వందేళ్ల భారతీయుల కలలు గంటున్న కలను తనెలా సాకారం చేశాడు? ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన నీరజ్ కు స్వర్ణ పతకం ఎలా సాధ్యపడిందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...