Skip to main content

రైతు వేషంలో సబ్ కలెక్టర్

 


అధికారులు లేదా ప్రజాప్రతినిధులతో మారు వేషంలో అకస్మిక తనిఖీలు చేయడం సినిమాల్లో ఎక్కువగా చూసుంటాం. నిజ జీవితంలోనూ అడపాదడపా ఇలాంటి తనిఖీలు చోటు చేసుకుంటాయి.నిజాయితీ,నిబద్దత కలిగిన కొంతమంది అధికారులు ప్రజల ఇబ్బందులను తెలుసుకునేందుకు ఇలా మారు వేషాల్లో తనిఖీలు చేస్తుంటారు. తాజాగా కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ ఇలాగే మారు వేషంలో వెళ్లి ఎరువుల షాపులు నడిపే యజమానులకు షాకిచ్చాడు. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు ఎరువులను విక్రయిస్తున్న వైనాన్ని రెడ్ హ్యాండెడ్‌గా బట్టబయలు చేశారు.