Skip to main content

ప్రధాని మోడీ, తెలంగాణా సీఎం కేసీఆర్ ఇద్దరూ రైతు వ్యతిరేకులే

కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రైతులు ఆందోళన కొనసాగుతూనే ఉంది. కిసాన్ సంసద్ పేరుతో రైతుల పార్లమెంటును నిర్వహిస్తూ పార్లమెంటు సమావేశాల సందర్భంగా నిరసన తెలియజేస్తున్న రైతులు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక వీరి పోరాటానికి మద్దతుగా ఈరోజు జంతర్ మంతర్ వద్ద ప్రతిపక్ష పార్టీల నాయకులు కేంద్రాన్ని నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కేంద్రంపై విరుచుకుపడ్డారు.