Skip to main content

కేసీఆర్! చిత్తశుద్ధి ఉంటే అలా చేయండి:

 


హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్)కు హుజూరాబాద్ ప్రజల కంటే వారి ఓట్లమీదనే ప్రేమ ఎక్కువ అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. అనారోగ్యం నుంచి కోలుకుని జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి నుంచి గురువారం డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు మెరుగైన వైద్యం అందించిన అపోలో యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రంలో ఉద్యమకారులంతా కనుమరుగవుతున్నారని.. తెలంగాణ ద్రోహులంతా తెరపైకి వస్తున్నారని ఈటల రాజేంరద్ అన్నారు.