ఇది ఇలావుండగా, 299 టీఎంసీల కోటా నుంచి తెలంగాణ అదనంగా నీరు వాడుకుందని, కేంద్రం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వైసీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కోరారు. సోమవారం లోక్‌సభలో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. వరదజలాల వినియోగంపై కేంద్రం వాటర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ తయారుచేయాలన్నారు. ప్రకాశం బ్యారేజ్‌ని కేఆర్‌ఎంబీ పార్టీ నుంచి డీనోటిఫై చేయాలని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కోరారు.