Skip to main content

తెలంగాణలో ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ పూర్తి

 


తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. జిల్లాలు,జోనల్,మల్టీజోనల్ పోస్టులుగా ఉద్యోగాలను పునర్యవ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కొత్త జోన్లు,మల్టీ జోన్లను ఏర్పాటు చేస్తూ అగస్టు,2018లో ప్రభుత్వం జీవో ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఉద్యోగాల పునర్వ్యవస్థీకరణను 36 నెలల్లోగా పూర్తి చేయాలి. ప్రస్తుత నెలతో ఆ గడువు పూర్తవనుండటంతో ప్రభుత్వం తాజాగా దీన్ని పూర్తి చేసింది. ఉపాధ్యాయ పోస్టులు మినహా అన్నిశాఖల పోస్టుల కేటగిరీలను నిర్ణయించారు.