Skip to main content

హైకోర్టు మెట్లెక్కిన తీన్మార్ మల్లన్న

 


తీన్మార్ మల్లన్న హైకోర్టును ఆశ్రయించాడు. తనపై కేసుల నమోదు వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. ఈ నెల 3న తనకు నోటీసులు ఇచ్చారని, రెండ్రోజుల సమయంలోనే విచారణకు పిలిచారని వాపోయారు. హైదరాబాద్‌లోని మారుతీ జ్యోతిష్యాలయం నిర్వాహకుడు లక్ష్మీకాంతశర్మను డబ్బులు డిమాండ్ చేశాడనే ఫిర్యాదుపై తీన్మార్ మల్లన్నపై కేసు నమోదైంది. తీన్మార్ మల్లన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై సీసీఎస్, చిలకలగూడ పీఎస్‌లో కేసులు నమోదయ్యాయని, దర్యాప్తు పేరుతో పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.