Skip to main content

ఈటలకు రాజాసింగ్, రఘునందన్ పరామర్శ.. ఏడోసారి గెలుస్తారని అని ధీమా..

 


అనారోగ్యంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయనను పార్టీ నేతలు కలిసి పరామర్శిస్తున్నారు. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వివేక్ పరామర్శించిన సంగతి తెలిసిందే. ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్ పరామర్శించారు. ఆసుపత్రిలో ఈటల రాజేందర్ బాగోగులను అడిగి తెలుసుకున్నారు.

ఈటల రాజేందర్ బాగానే ఉన్నారని, రేపు డిశ్చార్జి అవుతారని రాజాసింగ్ చెప్పారు. ప్రజాదీవెన పాదయాత్రను పున:ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు.