Skip to main content

తిరుమ‌ల శ్రీ‌వారికి కొత్తగా ‘నవనీత సేవ’

 


తిరుమ‌ల శ్రీ‌వారి నైవేద్యాల కోసం ప్ర‌తిరోజు అవ‌స‌ర‌మ‌య్యే నెయ్యి దేశ‌వాళీ ఆవుల పాల నుంచి త‌యారుచేయ‌డానికి త్వ‌ర‌లో 'నవనీత సేవ' పేరుతో ఓ కొత్త సేవ‌ను ప్రారంభించాలని నిర్ణయించిన‌ట్లు టీటీడీ సాధికార మండ‌లి ఛైర్మ‌న్‌, ఈవో డాక్ట‌ర్ కెఎస్‌ జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. సాధికార‌ మండలి సమావేశం శుక్ర‌వారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. స‌మావేశం అనంత‌రం ఈవో మీడియాతో మాట్లాడారు. - శ్రీ‌వారి ఆల‌యంలో నైవేద్యానికి వినియోగించే ప్ర‌సాదాల త‌యారీకి రోజుకు 30 కిలోల దాకా నెయ్యి అవ‌స‌ర‌మ‌వుతుంది. ఇందుకోసం సుమారు 1200 లీటర్ల పాలు అవసరమవుతాయి.