నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నందిపేట మండలంలోని గోదావరి నదిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతయిన యువకుల కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టారు.భారీ వర్షాలకు గోదావరి నిండుగా ప్రవహిస్తుండటంతో చాలామంది పర్యాటకులు నది తీర అందాలను ఆస్వాదించేందుకు వెళ్తున్నారు. ఆదివారం(అగస్టు 1) స్నేహితుల దినోత్సవం కావడంతో నిజామాబాద్ జిల్లా అర్సపల్లికి చెందిన ఆరుగురు స్నేహితులు కలిసి గోదావరి అందాలు వీక్షించేందుకు వెళ్లారు. అక్కడికెళ్లాక నదిలో స్నానం చేసేందుకు లోపలికి దిగారు.