Skip to main content

రాహుల్ గాంధీ ట్విటర్ అకౌంట్ రద్దు


వివిధ అంశాలు మోదీ సర్కారుపై పోరులో బిజీగా ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ షాకిచ్చిన వ్యవహారం ఆలస్యంగా వెల్లడైంది. ట్విటర్ సంస్థ రాహుల్ గాంధీ అధికారిక అకౌంట్ ను తాత్కాలికంగా రద్దు చేసిందని కాంగ్రెస్ పార్టీ శనివారం నాడు ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, కొద్ది గంటల వ్యవధిలోనే ఖాతాను పునరుద్ధరించారు.