ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) యూనిట్‌ను తిరిగి పునరుద్ధరించాల్సిందిగా రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ పరిశ్రమల 1996 నుండి మూసివేయబడింది. గురువారం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేకు రాసిన లేఖలో మంత్రి కేటీఆర్ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యపై గతంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చించినప్పటికీ ఎటువంటి పురోభివృద్ధి లేదన్నారు.