హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో వివాదాలు, వాగ్వాదాలు, తోపులాటలు, భిన్నాభిప్రాయాలు, అసంతృప్తి జ్వాలలు అసహనం వ్యక్తం చేయడం సర్వసాధారణం. కాని అలాంటి ఘటనలన్నీ మొన్నటి వరకు. రేవంత్ రెడ్డి అద్యక్షుడు అయిన తర్వాత ఇలాంటి ఘటనలకు చెక్ పెడతారని, ఐకమత్యంతో పార్టీ నేతలు ముందుకు వెళ్తారని అందరూ భావించారు. కాని అలా జరగలేదు. మీడియా ముందు, పార్టీ ముఖ్య నేతల ముందు స్వయంగా పార్టీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డికి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డికి వాగ్వాదం జరిగింది. ఈ సంఘటనతో పార్టీ క్యాడర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.