Skip to main content

విరిగిన పులిచింతల ప్రాజెక్టు గేటు -భారీగా నీరు లీకేజీ

 


ఆంధ్రప్రదేశ్ లో అతి కీలకమైన ప్రాజెక్టుల్లో ఒకటైన పులిచింతల(కేఎల్ రావు మల్టీ పర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్టు)లో అనూహ్య ఘటన జరిగింది. ప్రాజెక్టులో నీటిని నిలువ ఉంచేందుకు అతి ముఖ్యమైన క్రస్ట్ గేట్లలో ఒకటి ధ్వంసమైంది. దీంతో భారీ ఎత్తున నీరు లీకవుతూ ప్రకాశం బ్యారేజీ వైపు పరుగులు తీస్తున్నది. ఈ ఘటనతో అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ(ఏపీఎస్డీఎంఏ) కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అలర్ట్ జారీ చేసింది..