Skip to main content

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులకు మావోలకు మధ్య ఎదురు కాల్పులు ..

 


మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు జరుగుతున్నాయి. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు నేపథ్యంలో తెలంగాణా, చత్తీస్ గడ్, ఆంధ్ర ఒడిశా బోర్డర్లో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించి అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్న విషయం తెలిసిందే. మావోయిస్ట్ వారోత్సవాలలో భాగంగా విధ్వంసం సృష్టించడానికి చర్ల ఎల్ఓఎస్ మరియు బెటాలియన్ యాక్షన్ టీంలు కుర్ణపల్లి - బోదనెల్లి ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో స్పెషల్ పార్టీ పోలీసు బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు.