Skip to main content

తెలంగాణలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు: 9వేల దిగువకు యాక్టివ్ కేసులు, జిల్లావారీగా..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది.

అయితే, ఒక్కోసారి కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఒక్కోరోజు కేసులు స్వల్పంగా పెరగడం, తగ్గడం జరుగుతోంది. రాష్ట్రంలో తాజాగా కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో 1,07,329 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 582 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.తాజాగా, నమోదైన 582 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,47,811కు చేరింది. కరోనాతో కొత్తగా ముగ్గురు మరణించారు.