కోర్టు ధిక్కరణ కేసుల ఖర్చులకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఈ విషయంపై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఓ లెక్చరర్ దాఖలు చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిమా కోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మానం విచారణ చేసింది.
కోర్టు ధిక్కరణ కేసులకు రూ. 58 కోట్లు మంజూరు చేయడమేంటని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రజాధనం ఎలా ఖర్చు చేస్తారో వివరించాలని, ట్రెజరీ నిబంధనలు ఎలా అనుమతిస్తాయో చెప్పాలని ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది.
