2024 లో జరగనున్న ఎన్నికలలోనూ బీజేపీకి పట్టం కట్టడానికి ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహం రచిస్తున్నారు. ఇప్పటి నుండే ప్రజాక్షేత్రంలో ఒక సరికొత్త రూట్ మ్యాప్ తో వెళ్లాలని భావిస్తున్నారు. దేశంలో అనేక అంశాలపై కేంద్రం తీరుపై ప్రజల్లో అసహనం పెరుగుతున్న సమయంలో ప్రజల మద్దతు కూడగట్టడం కోసం ఇప్పటినుండి వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతున్నారు. 2024 ఎన్నికల టార్గెట్ గా ప్రధాని నరేంద్ర మోడీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా వచ్చేవారం నూతన మంత్రి మండలితో మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నారు.
