Skip to main content

16వ తేదీ నుంచి రుణమాఫీ: ఖాతాలో జమచేయాలి, కట్ చేసుకోవద్దు

 


రైతుల ఖాతాలో రుణ‌మాఫీ న‌గ‌దు ఈ నెల 16వ తేదీ నుంచి జ‌మ‌కానుంది. రూ.50 వేల వ‌ర‌కు రైతు రుణాల‌ను మాఫీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ఇటీవ‌లే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం బీఆర్‌కేఆర్ భ‌వ‌న్‌లో రాష్ట్ర ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు, వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి బ్యాంక‌ర్ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. 42 బ్యాంకుల అధికారులు సమావేశానికి హాజ‌ర‌య్యారు.రూ. 50 వేల లోపు రైతు రుణ మాఫీపై క్యాబినెట్ సమావేశంలో సీఎం ఆదేశాల మేరకు సమావేశం నిర్వహిస్తున్న‌ామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.