ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 16 కోట్ల రూపాయల విలువ చేసే ఇంజక్షన్ తీసుకున్న ఏడాది పాప వేదిక సౌరబ్ షిండే మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ కూడా పాప ప్రాణాలను కాపాడలేకపోయింది . జన్యుపరమైన రుగ్మత కారణంగా ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడిన ఒక సంవత్సరం వయసున్న వేదికా సౌరభ్ షిండే పూణేలోని దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో కన్నుమూసింది . వేదిక మృతితో ఆమె కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది.