Skip to main content

రూ. 10 కూల్ డ్రింక్ తాగి అమ్మాయి ప్రాణం పోయింది


 చెన్నై: తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా జీవిస్తున్న అక్కాచెల్లి పగటి పూట సాటి స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా స్కూల్ మూసి వేయడంతో తల్లితో కలిసి అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. ఇంట్లో వంట చేసి పెట్టిన తల్లి ఎప్పటి లాగా ఆమె పనికి ఆమె వెళ్లిపోయింది. ఇంటి ముందు ఆడుకుంటున్న అమ్మాయి సమీపంలోని షాపులోకి వెళ్లి కూల్ డ్రింగ్ తీసుకుని తాగింది. కూల్ డ్రింక్ తాగిన కొంత సేపటికే ఆ అమ్మాయి కిందపడిపోయి స్పృహ తప్పిపోయింది. సోదరి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆమె అక్క గట్టిగా కేకలు వేసి చుట్టుపక్కల వారికి విషయం చెప్పింది.