Skip to main content

పడవలో ఆడుకుంటూ నీళ్ళలో పడిన 10 మంది చిన్నారులు ..

 


కృష్ణా జిల్లాలో ఓ పడవ బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని దాములూరు గ్రామంలో కృష్ణా నది ఒడ్డున ఉన్న పడవెక్కి ఆడుకుంటున్న పిల్లలు పడవ బోల్తా పడడంతో నదిలో పడిపోయారు. నీళ్లల్లో పడిన 10 మంది చిన్నారులను కాపాడటం కోసం స్థానిక రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. పడవలో ఉన్న మొత్తం 10 మందిలో తొమ్మిది మందిని స్థానికులు సురక్షితంగా బయటకు తీసుకు రాగా, ఒక బాలుడు మరణించినట్లుగా తెలుస్తుంది. గల్లంతైన బాలుడి కోసం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది.