Skip to main content

10 కిలోల బియ్యం ఉచితం.. ఈ నెలలో మాత్రం 15 కిలోలు: మంత్రి గంగుల



బీపీఎల్ కుటుంబాలు, పేదలకు ఈ నెల (ఆగస్ట్) నుంచి ఉచితంగా 10 కిలోల బియ్యం అందిస్తామని పౌరసరఫరాల శాఖమంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.తెల్ల రేషన్‌కార్డుదారులకు నవంబర్‌ వరకు పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు. కొత్తగా రేషన్‌కార్డులు పొందినవారికి కూడా ఆగస్టు నుంచే బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. కొత్త కార్డుదారుల కోసం బియ్యం సేకరణ, కేటాయింపుల నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి జరగాల్సిన బియ్యం పంపిణీని 3వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు.