ప్రముఖ జర్నలిస్ట్,క్యూ న్యూస్ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్నపై అదే న్యూస్ ఛానెల్‌లో బ్యూరో చీఫ్‌గా పనిచేస్తున్న చిలకా ప్రవీణ్ అనే జర్నలిస్ట్ సంచలన ఆరోపణలు చేశారు. క్యూ న్యూస్‌ను అడ్డుపెట్టుకుని మల్లన్న ఇప్పటివరకూ రూ.200 కోట్లు వరకు వసూలు చేశాడని ఆరోపించారు. టీఆర్ఎస్,కాంగ్రెస్,ఎంపీలు బండి సంజయ్,ధర్మపురి అరవింద్‌ల నుంచి డబ్బులు తీసుకొచ్చుకున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే సీతక్కను కూడా మల్లన్న డబ్బులు డిమాండ్ చేశాడని... అయితే మల్లన్న సంగతి తెలిసి ఆమె డబ్బులు ఇవ్వలేదని అన్నారు.
