ప్రస్తుతం తెలంగాణ రాజకీయమంతా హుజురాబాద్ ఉపఎన్నిక ,దళిత బంధు పథకం చుట్టే తిరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైతే ఈ పథకాన్ని ప్రకటించారో... అనివార్యంగా ప్రతిపక్షాలు సైతం దానిపై మాట్లాడాల్సిన పరిస్థితి తలెత్తింది. పథకం అమలుపై అనేక సందేహాలు,అనుమానాలను ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఆరు నూరైనా దళిత బంధు అమలుచేసి తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు.ఈ పథకంతో ప్రతిపక్షాలను ఆయన ట్రాప్‌లో పడేశారన్న వాదన కూడా వినిపిస్తోంది. తాజాగా ఈ పథకంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.