Skip to main content

టీమిండియాతో టెస్ట్ సిరీస్‌ ముందు ఇంగ్లండ్‌కు షాక్..


భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 5 రోజుల ముందు ఇంగ్లండ్ క్రికెట్ టీంకు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. శుక్రవారం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) స్టోక్స్ ను సిరీస్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. స్టోక్స్ కొంత కాలంపాటు విశ్రాంతి తీసుకోనున్నాడని ఈసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. మానసిక ఆరోగ్యంతోపాటు వేలి గాయం కారణంగానే ఈ సిరీస్‌ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.