Skip to main content

వామ్మో.. ఇలా కూడా బడి ఎగ్గొట్టొచ్చా?


బడికి వెళ్లకుండా ఉండేందుకు బ్రిటన్లో కొందరు విద్యార్థులు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కరోనా పాజిటివ్ గా వచ్చేందుకు యాంటీజెన్ టెస్టు కిట్లో నిమ్మకాయ రసంతో వివిధ పదార్థాలు కలిపి వేస్తున్నారు. దీంతో అది పాజిటివ్ గా చూపించడంతో స్కూల్ ఎగ్గొడుతున్నారు. టిక్టాక్ ద్వారా విద్యార్థులు ఇలాంటివి నేర్చుకుంటున్నారని విద్యావేత్తలు చెబుతున్నారు. ఈ తరహా వీడియోలు అక్కడ టిక్క్లో చక్కర్లు కొడుతున్నాయి.