దేశవ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం పూర్తిగా తగ్గకముందే ధర్డ్ వేవ్ భయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇంకా కోవిడ్ కేసులు పూర్తిగా తగ్గకపోవడంతో ప్రభుత్వాలతో పాటు డాక్టర్లు కూడా తలపట్టుకుంటున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం 10 శాతానికి మించి పాజిటివిటీ రేటు కలిగిన 46 జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.
కేరళ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఒడిశా, అస్సోం, మిజోరం, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, మణిపూర్ లోని 46 జిల్లాలకు కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.