Skip to main content

ఇండియాలో కరోనా .. గత 24 గంటల్లో రికవరీలు 37 వేలు, 41 వేలకు పైగా కొత్త కేసులు !!


కేరళ లో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో కేంద్రం ఆరుగురు సభ్యుల నిపుణుల బృందాన్ని కేరళకు పంపింది. కేరళలో శుక్రవారం 24 గంటల వ్యవధిలో 20,772 కొత్త కోవిడ్ -9 కేసులు, 14,651 రికవరీలు , 116 మరణాలు నమోదయ్యాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోవిడ్ -19 టీకాను ప్రతి నెలా ఒక కోటి మందికి అందించే సామర్ధ్యం కలిగి ఉన్నారని, ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో కరోనా కంట్రోల్లో ఉందని, ఇక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగించడానికి మరిన్ని టీకాలు అందించాలని కేంద్రాన్ని కోరారు.