Skip to main content

కోవిడ్ ఎమర్జెన్సీ ప్యాకేజీ రూ. 1827 కోట్లు విడుదల

 


దేశంలో కరోనావైరస్ థర్డ్ వేవ్ వ్యాప్తి ముప్పు పొంచివున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత కరోనావైరస్ అత్యవసర స్పందన, ఆరోగ్య వ్యవస్థల సన్నద్దత ప్యాకేజీ(ఈసీఆర్పీ) రెండో దశలో భాగంగా 15 శాతం నిధులు అంటే రూ. 1827 కోట్లును రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు శనివారం విడుదల చేసింది. ఈసీఆర్పీ-2 కింద మొత్తం రూ. 23,123 కోట్ల నిధుల అందజేతకు ఆమోదం లభించిన నేపథ్యంలో ఈ మేరకు నిధులను విడుదల చేసింది. వివిధ రాష్ట్రాలకు కేటాయించిన నిధుల వాటా వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.