Skip to main content

'KTRను హుజూరాబాద్లో నిలబెట్టగలరా?'

 

ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత BJP, TRSల మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది. ఎన్నికలకు 5 నెలల సమయమున్నా విమర్శల ఘాటు ఎక్కువైంది. ఈ క్రమంలో తాజాగా కేసీఆర్కు BJP ఎంపీ అర్వింద్ ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే KTRను హుజూరాబాద్లో పోటీకి నిలబెట్టాలని అన్నారు. కేటీఆర్ను సీఎం చేయాలనే ఈటలను పదవి నుంచి తొలగించారని విమర్శించారు. ఈ ఉప ఎన్నికకు రూ. 300 కోట్లు ఖర్చుపెట్టేందుకు TRS రెడీ అవుతోందని అర్వింద్ అన్నారు.