Skip to main content
మెసేజ్లో వచ్చే కేవైసీ లింక్పై క్లిక్ చేయవద్దు
SBI కస్టమర్లను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. కేవైసీ అప్డేట్ చేయాలంటూ వచ్చే మెసేజ్లను నమ్మవద్దని సూచించారు. మెసేజ్లో వచ్చే లింక్పై క్లిక్ చేస్తే KYC అప్డేట్ అవుతుందని, లేదంటే బ్యాంకు అకౌంట్ సస్పెండ్ అవుతుందని నమ్మిస్తారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లింక్పై క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. బ్యాంకు కేవైసీకి సంబంధించి ఎలాంటి లింక్స్ పంపదని తెలిపారు.