Skip to main content

ఈ రోజే ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు


తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలను ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రకటించనున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిజల్ట్స్ విడుదల చేయనుండగా.. మార్కులను వెబ్సైట్లో ఉంచనున్నారు. పరీక్షలు రద్దైన నేపథ్యంలో.. ఫస్టియర్ మార్కులనే సెకండియర్లోనూ కేటాయిస్తారు. రాష్ట్రంలో ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలకు ఫీజులు చెల్లించినవారు మొత్తం 4,73,967 మంది ఉన్నారు. ఎగ్జామ్ ఫీజు కట్టిన ప్రతి విద్యార్థిని పాస్ చేయనున్నారు.