Skip to main content

తెలంగాణలో భారీ వర్షాలు.. రాష్ట్రంలోని ఈ జిల్లాల్లో కుండపోత వానలు


 తెలంగాణలో సోమవారం పలు ప్రాంతీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, పెద్దపల్లి, కామరెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేసింది.ఇక మంచిర్యాల, కొమ్రంభీమ్ అసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్‌, రంగారెడ్డి, జోగులాంగ గద్వాల్ తదితర జిల్లాలోని కొన్ని చోట్ల మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. సోమవారం నుంచి నుంచి మంగళవారం ఉదయం వరకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పలు చోట్ల ఉరుములుఎ, మెరుపులతో కూడిన వర్షం కురియనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.