Skip to main content
జులై 1 నుంచి బయోమెట్రిక్ తప్పనిసరి
AP: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు జులై 1 నుంచి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కార్యాలయానికి వచ్చినప్పుడు, వెళ్లేటప్పుడు బయోమెట్రిక్ వేయాలని, దాని ప్రకారమే జీతాలు చెల్లిస్తామని తెలిపింది. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు కార్యాలయాల్లోనే ఉండి ప్రజల వినతులను స్వీకరించాలని ఆదేశించింది. డ్యూటీలో భాగంగా ఎక్కడికైనా వెళ్తే మూమెంట్ రిజిస్టర్లో నమోదు చేయాలంది.